గోల్కొండ కోటలో శనివారం పాము కలకలం సృష్టించింది. లేజర్ షో ప్రదర్శించే మైదానం సమీపంలో ఆరు అడుగుల నాగుపాము కనిపించడంతో సిబ్బంది కంగుతిన్నారు. వెంటనే పోలీసుల ద్వారా మలక్ పేట్ ట్రాపిక్ కానిస్టేబుల్ వెంకటేష్ కు సమాచారమిచ్చారు. గోల్కొండ కోటకు చేరుకున్న ఆయన అరగంట శ్రమించి చాకచక్యంగా కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ ను గోల్కొండ ఇన్స్పెక్టర్ సైదులు, ఎస్సైలు రాము, నోహితా అభినందించారు.