సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుధీప్ దూరిశెట్టి తమ పూర్తి వివరాలను ఎన్యుమరెటర్ అందజేశారు. ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్-13 లోని కలెక్టర్ బంగ్లాకు వెళ్లిన సిబ్బంది ఆయనకు 75 ప్రశ్నలతో కూడిన సర్వే ఫారాన్ని అందజేశారు. క్షుణ్ణంగా దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ అందులోని అన్ని ప్రశ్నలకు వివరాలు నమోదు చేసి అధికారులకు అందజేశారు.