ఏఐ టెక్నాలజీతో శాటిలైట్ ఇమెజింగ్ ద్వారా ముందస్తుగానే పంటలకు వచ్చే చీడ పురుగులను మొదట్లోనే నిరోధించే విధంగా టెక్నాలజీ గురించి కృషివాస్ సంస్థ ప్రతినిధులు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకి వివరించారు. పంట బయటకు కనిపించే వాటినే కాకుండా పంట అంతర్గతంగా ఉన్న తెగులు కూడా గుర్తించి దానికి నివారణ చర్యలు సిఫార్సు చేస్తుందని తెలిపారు. పొలంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ మొక్కకు తెగులు సోకిందో ముందుగానే గుర్తించి పిచికారి మందును ఏఐ చెబుతోందన్నారు.