
ప్రభాస్ కొత్త చిత్రంలో రాహుల్ రవీంద్రన్!
హను రాఘవపూడి- ప్రభాస్ కాంబోలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ (వర్కింగ్ టైటిల్). తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. దీంట్లో ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ భాగమయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘హను రాఘవపూడి సినిమాలో నటిస్తున్నా. అందుకోసమే ఈ లుక్ కొనసాగిస్తున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో రాహుల్ తెలిపారు.