సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు 8 రోజుల పాటు జపాన్‌లో పర్యటించనున్నారు. ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో పాల్గొననున్నారు. టోక్యోలో పెట్టుబడులపై పలు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. జపాన్‌లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు.