ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్‌నూస్ చెప్పింది. ఇళ్లు కట్టుకునే వారికి తక్కువ ధరకు సిమెంట్, స్టీలు సరఫరా చేయనుంది. మార్కెట్ రేటు కంటే ఎంత తక్కువకు సరఫరా చేస్తారో చెప్పాలని కంపెనీలతో అధికారులు భేటీ అయ్యారు. రూ.320 ఉన్న సిమెంట్ బస్తా రూ.260కు, రూ.55 వేలు ఉన్న టన్ను స్టీల్ రూ.47 వేలకు సరఫరా చేయాలని కోరినట్లు సమాచారం. ఒక్కో ఇంటికి 180 బస్తాల సిమెంట్, 1500 కిలోల స్టీల్ అవసరం అవుతాయి.