హైదరాబాద్: తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి సీతక్క శనివారం అన్నారు. ఆసరా లేని పిల్లల్ని చేరదీసి, సంరక్షిస్తే నెలకు రూ.4500 ఇస్తామని ప్రకటించారు. శిశువిహార్ సంరక్షణలో ఉన్న అనాథ చిన్నారులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆమె ఆరోగ్యశ్రీ కార్డులు అందించారు. ముందుగా హైదరాబాద్‌లో 2200 మందికి ఈ కార్డులను ఇస్తున్నామన్నారు.