ప్రజా అవసరాల మేరకు అభివృద్ధి పనులను చేపడుతున్నామని కార్వాన్ ఎంఐఎం కార్పొరేటర్ స్వామి యాదవ్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని కార్గిల్ నగర్ లో కొనసాగుతున్న డ్రైనేజీ పనులను కార్పోరేటర్ పరిశీలించారు. పనిలో పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్గిల్ నగర్ నుంచి ధరియా బాగ్ వరకు ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనుల్లో తప్పకుండా నానితో ప్రమాణాలు పాటించాలన్నారు.