ఆషాఢ బోనాల రివ్యూ సమావేశంలో మంగళవారం హైదరాబాద్లో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మొత్తం 28 దేవాలయాల్లో బోనాల జాతరలు ఘనంగా జరగాలన్నారు. ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు రాకూడదని అధికారులకు సూచించారు. రూ. 20 కోట్లు ప్రభుత్వం విడుదల చేయగా, అవసరమైతే సీఎం దృష్టికి తీసుకెళ్లి మరింత నిధులు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జూన్ 26న గోల్కొండ బోనం ప్రారంభమవుతుందని తెలిపారు.