హైదరాబాద్: అడుగంటుతున్న ప్రాజెక్టులు

56చూసినవారు
హైదరాబాద్: అడుగంటుతున్న ప్రాజెక్టులు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాల్లో నీటి నిల్వలు నానాటికీ తగ్గిపోతున్నాయి. వేసవి తీవ్రత పెరుగుతుండటంతో కనీస స్థాయుల్ని దాటి కిందికి పడిపోతున్నాయి. శ్రీశైలం(సామర్థ్యం 215 టీఎంసీలు)లో 39 టీఎంసీలే ఉంది. నాగార్జునసాగర్లో (సామర్థ్యం 312 టీఎంసీలు) 141 టీఎంసీల నీరు మిగిలింది. సాగర్లో మరో ఐదు అడుగుల మేర నీరు దిగువకు వెళ్తే హైదరాబాద్ జలమండలి అత్యవసర పంపింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

సంబంధిత పోస్ట్