హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలోనే పగటిపూట సూర్యుడు భగభగమంటున్నాడు. దీంతో ప్రజలు భయట తిరిగేందుకు భయపడుతున్నారు. ఇక రాత్రి సమయంలో ఉక్కపోత పెరిగింది. ఏసి, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరిగిపోయింది. ఇప్పుడే పరిస్థితి ఇలావుంటే నడి వేసవిలో ఎండలు ఇంకే స్థాయిలో వుంటాయోనని ప్రజలు భయపడిపోతున్నారు.