నానల్ నగర్ డివిజన్లో గురువారం దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హకీంపేట సోలార్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన జనగణమన ఆలపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మహ్మద్ నజీరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.