హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలని అధికారులకు సూచించారు. లేఅవుట్లలో ప్రజల అవసరాల కోసం కేటాయించిన స్థలాల్లో బడులు నిర్మించాలని చెప్పారు. గురుకులాల తరహాలో సౌకర్యాల కల్పనపై అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు.