నిమ్స్ లో చికిత్స పొందుతున్న గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజను అమే కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత శనివారం పరామర్శించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఆస్వస్థతకు గురి కావడం బాధాకరమన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం తోనే విద్యార్థులకు ఇటువంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.