సీఎం రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్
By Vikram Goud 85చూసినవారుబీఆర్ఎస్ సీనియర్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై సీఎం చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనానికి బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. అసెంబ్లీ సాక్షిగా తనస్థాయి మరిచి సీఎం చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కోరారు.