మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైన నేపథ్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్ ( బీఆర్ఎస్ కార్యాలయం) వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసు కేసును విచారించేందుకు ఏసీబీ ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసింది. బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీసులో ఏసీబీ డీజీ విజయ్ కుమార్ అధికారులతో సమావేశమై చర్చిస్తున్నారు. ఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించి అవకాశం ఉంది.