Top 10 viral news 🔥
రతన్ టాటా ఆరోగ్యం విషమం?
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్రిటికల్ కండిషన్లో ఉన్న టాటా ముంబైలోని ఓ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయపై టాటా గ్రూప్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.