తెలంగాణలో విద్యుత్ చార్జీలను పెంచవద్దని విద్యుత్ నియంత్రణ మండలికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వ్యవసాయ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు అన్ని విద్యుత్ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయన్నారు. సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలను మిగిత వాటికి ఒకే రకమైన టారిఫ్ విధించలాన్న ఆలోచన అన్యాయం అని పేర్కొన్నారు. ఇది చిన్న వాళ్ళకు చావుదెబ్బ కొడుతుందని కేటీఆర్ తెలిపారు.