మానవత్వం చాటుకున్న జిహెచ్ఎంసి మేయర్

53చూసినవారు
మానవత్వం చాటుకున్న జిహెచ్ఎంసి మేయర్
జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి మానవ తత్వం చాటుకున్నారు. గురువారం సాయంత్రం కేబీఆర్ పార్కుకు ఆమె వాకింగ్ వెళ్లారు. పార్క్ వద్ద నిస్సహా స్థితిలో ఉన్న ఓ వృద్ధుడు నీ గమనించారు. స్వయంగా అతడి దగ్గరికి వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. గత రెండు రోజులుగా ఏమి తినలేదని , ఒక కాలు కూడా లేదని సదరు వృద్ధుడు తెలిపాడు. చలించిపోయిన ఆమె వెంటనే డిఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించారు. పోలీసుల సహాయంతో బేగంపేటలోని స్టేలర్ రూమ్ కి తరలించారు.

సంబంధిత పోస్ట్