హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

85చూసినవారు
హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్‌: నారాయణపేట జిల్లాలోని మాగనూరు హైస్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై సీఎం రేవంత్‌ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సీఎం తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్