సంక్రాంతి సీజన్ అంటే అందరికీ పండగే. సామాన్యులకు భక్తి. వ్యాపారులకు మాత్రం భుక్తి. జనాలను దోచుకోడానికి అనుకూలించే పర్ఫెక్ట్ సీజన్ ఇది. పండక్కి జనం ఇంటికి వెళ్లి కుటుంబాలతో పాటు ఎంజాయ్ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. బస్సుల్లోనో, రైళ్లలోనో, ఫ్లైట్స్ బుక్ చేసుకునో, క్యాబ్‌లు మాట్లాడుకోనో వెళ్తుంటారు. ఇదే అదనుగా ప్రైవేట్ వాహనదారులు, ట్రావెల్స్ ఏజన్సీలు టికెట్ రేట్లు భారీగా పెంచేస్తున్నాయి. సాధారంగా 1000 రూ ఉంటే రెండింతలు పెంచేస్తున్నారు.