రైతు భరోసా ఇప్పటికే రెండు సార్లు ఇచ్చామని.. సోమవారం నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి పెట్టుబడి కోసం రూ.12 వేలు ఇస్తామని చెప్పారు. 'గత ప్రభుత్వం 10 ఏళ్లలో రూ.17,000 కోట్లు రుణమాఫీ చేస్తే, మన ప్రభుత్వం 18 నెలల్లోనే రూ.21,000 కోట్లు రుణమాఫీ చేసింది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం' అని వివరించారు.