జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో 147 అర్జీలు అందగా కమిషనర్ ఆర్వీ కర్ణన్ వాటిని త్వరగా పరిష్కరించాల్సిందిగా సంభందిత అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, హెల్త్, శానిటేషన్ విభాగాలకు అధిక పిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రజలు జీహెచ్ఎంసీ యాప్ ద్వారా కూడా సమస్యలకు సంబంధించిన పిర్యాదులు చేయవచ్చని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.