అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మహిళ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. గురువారం బంజారాహిల్స్ లో నిరసన తెలుపుతున్న ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నె గోవర్ధన్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఖబడ్దార్ రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు.