ఖైరతాబాద్: ఆస్తి కోసం తాతను హత్య చేసిన మనవడు

52చూసినవారు
ఖైరతాబాద్: ఆస్తి కోసం తాతను హత్య చేసిన మనవడు
సామాజిగూడ డివిజన్ లోని బిఎస్ఎన్ మక్తాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వి.చంద్రశేఖర్ జనార్దన్ (84) ను సొంత మనవాడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెడు వ్యసనాలకు బానిసైన కీర్తి తేజ తనకు డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదనే కోపంతో గురువారం తనతో తెచ్చుకున్న కత్తితో జనార్దన్ ను విచక్షణ రహితంగా 73 సార్లు పొడిచాడు.అడ్డు వచ్చిన తల్లి పై కూడా దాడి చేయగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్