బీసీలకు అన్యాయం చేసే కుట్రలను సమిష్టిగా తెప్పికూడదామని బీసీ సంఘాల నేతలు తీర్మానించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ జన గణనపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. బీసీ నాయకుడు కుందారం గణేష్ చారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, బిసి ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవిలు తదితరులు పాల్గోన్నారు.