మొహరం ఏర్పాట్లపై హైదరాబాద్ ఇంచార్జీ, మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షబ్బీర్ ఆలీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. భద్రత, శానిటేషన్, తాగునీటి సరఫరా, విద్యుత్, ట్రాపిక్ మేనేజ్ మెంట్, అంశాలపై చర్చ జరిగింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను సూచించారు.