గత రెండు రోజుల నుంచి జూబ్లీహిల్స్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సమాచార హక్కు చట్టం-2005 పటిష్టత శిక్షణ తరగతులు ముగిసాయి. ఈ శిక్షణలో పాల్గొన్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఆళవందార్ వేణు మాధవ్, రాళ్లబండి రాజన్న, మెరుగు రాజయ్య, పెద్దపల్లి కోటిలింగం పాల్గొని స్ఫూర్తి పొందారు.