తెలంగాణ రాష్ట్రంలో ఈఏడాది వరి సాగు విస్తీర్ణంలో 50% సన్న రకాలు సాగయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ లో తెలిపారు. భవిష్యత్తులో 100% సన్నాలు పండించే రోజులు వస్తున్నాయన్నారు. ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాకు రూ 500 బోనస్ చెల్లిస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు. సన్న వడ్ల సేకరణకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాల్లో వేరువేరు కాంటలు ఏర్పాటు చేస్తామన్నారు.