బీసీల జనాభా తగ్గట్టు గురుకులాల సీట్ల సంఖ్యను పెంచాలి: జాజుల

72చూసినవారు
బీసీల జనాభా తగ్గట్టు గురుకులాల సీట్ల సంఖ్యను పెంచాలి: జాజుల
బీసీల జనాభాకు తగ్గట్టుగా బీసీ గురుకులాల సంఖ్యను పెంచాలని కోరుతూ గురుకులాల కార్యదర్శికి వినతిపత్రం సమర్పించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ పేర్కొన్నారు. బీసీ గురుకుల పాఠశాలలు విద్యార్థులకు సరిపోవడం లేదని వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే కేవలం వందల మందికి మాత్రమే అవకాశాలు దొరుకుతున్నాయని అన్నారు. గురుకులాల సీట్ల సంఖ్యను రెట్టింపు చేస్తే తప్ప బీసీలకు న్యాయం జరగదని అన్నారు.