తెలంగాణలో భూ వివాదాల‌కు శాశ్వత ప‌రిష్కారం

56చూసినవారు
తెలంగాణలో భూ వివాదాల‌కు శాశ్వత ప‌రిష్కారం
రైతుల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు అందించేందుకు, భూ లావాదేవీల‌ను స‌మ‌ర్దవంతంగా, పార‌దర్శకంగా నిర్వహించ‌డానికి ప‌క‌డ్బందీ చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గురువారం అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో విజ‌య‌వంతంగా అమలవుతున్న లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ విధానాన్ని రాష్ట్రంలో అమ‌లు చేయ‌డానికి ప్రత్యేక కార్యాచర‌ణ‌ను రూపొందిస్తున్నామ‌న్నారు. ఇందులో భాగంగా 5 వేల మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్లను తీసుకోబోతున్నామ‌న్నారు.

సంబంధిత పోస్ట్