నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న హుక్కా పార్లర్‌పై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో 9మంది యజమానులు, ఉద్యోగులు, 15మంది కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఎండి అబ్దుల్ లతీఫ్‌ఖాన్, మడ్డె శ్యాంసుందర్ వద్ద నుంచి హుక్కాకు సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పంజాగట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో మియామి గల్లీ కేఫ్ పేరుతో హుక్కా సెంటర్‌ను నిర్వహిస్తున్నారు.