పంజాగుట్టలో బడికి తాళం, బయట కూర్చుని చదువుకున్న చిన్నారులు

65చూసినవారు
పంజాగుట్ట ప్రతాప్ నగర్ బస్తీలో గత 30 ఏళ్లుగా స్వచ్ఛంద సంస్థ చిన్నారుల కోసం పాఠశాలను నిర్వహిస్తోంది. ఇక్కడ కమ్యూనిటీ హాల్ కోసం ఉపయోగిస్తామని బస్తీ లీడర్లు తాళం వేశారు. చేసేదేమి లేక చిన్నారులు బయట కూర్చుని చదువుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు, పంజాగుట్ట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిన్నారులకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్