చరిత్ర వక్రీకరణతో తీసిన వీరమల్లు సినిమాను సరిచేసిన అనంతరమే విడుదల చేయాలని లేని పక్షంలో సినిమాను అడ్డుకుంటామని బీసీ సంఘాలు హెచ్చరించాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంఘాల నాయకులు శివ మాట్లాడారు. చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్స్ ఇతర సమాచార సాధనాల ద్వారా తెలుసుకున్న కథాంశాన్ని బట్టి సినిమా మొత్తం చరిత్రను వక్రీకరించినట్లు తెలుస్తుందని అన్నారు. సంబంధంలేని అంశాలను సినిమాలో పొందుపరిచారని అన్నారు.