జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధి ఖైరతాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ లో శనివారం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వివాదం తలెత్తి ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో భారీ సంఖ్యలో కాంగ్రెస్ నేతలు ఎమ్మార్వో ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. భారీ కేడ్లు ఏర్పాటు చేసి, తాళ్ళతో అదుపు చేసి ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు.