రోడ్డు ప్రమాదంలో యువతీ మృతి, యువకుడికి గాయాలు

71చూసినవారు
హైదరాబాద్‌ నారాయణగూడలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఉషాశ్రీ (21) అనే యువతి మృతి చెందింది. స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తున్న సమయంలో వేగంగా డివైడర్‌ను ఢీకొనడంతో ఆమె గాలిలో ఎగిరిపడి తల రోడ్డుకు తాకింది. అభిషేక్‌ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరూ హిమాయత్‌నగర్‌లో పార్టీకి వెళ్లి తిరిగి గురువారం ఉదయం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్