అరికేపూడి గాంధీ, అనుచరులను అరెస్ట్ చేయాల్సిందే: హరీష్
కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాల్సిందేనని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్ సీపీ ఆఫీస్ లో ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ డైరెక్షన్ లోనే దాడి జరిగిందని ఆరోపించారు. అక్రమ కేసులకు పోలీసులను వాడుకుంటున్నారని.. హోంగార్డులను ఇప్పటి వరకు జీతం ఇవ్వని దద్దమ్మ ప్రభుత్వం ఇది. దాడిపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.