కూకట్ పల్లి డిపో పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగులను ఉన్నతాధికారులు బుధవారం సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరచిన 3 జోడిలకు కూకట్ పల్లి డిపోలో బహుమతులను డిపో మేనేజర్ హరి అందజేశారు. దీనిలో భాగంగా 10 మంది డ్రైవర్లు, 10 కండెక్టర్లతో పాటు 10 మంది మెకానిక్ లకు ప్రశంస పాత్రలను అందజేసి వారిని సత్కరించారు. ప్రతి ఒక్కరూ ఇలానే కష్టపడాలని సూచించారు.