కూకట్ పల్లిలో శనివారం సంక్రాంతి రద్దీ మొదలైంది. సెలవులు రావడంతో సొంతూళ్ళకి ప్రజలు పయనమవుతున్నారు. జేఎన్టీయూ నుంచి కూకట్ పల్లి రావడానికి గంటకు పైగా సమయం పడుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్ కూడా రొడ్డెక్కడంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి.