హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ సర్దార్ పటేల్ నగర్‌లోని శ్రీలక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 22న అంకురార్పణం పూజలతో వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు.