బాలానగర్ హైవేపై తీవ్ర ఉద్రికత్త.. పోలీసులు లాఠీ చార్జ్ (వీడియో)

78చూసినవారు
హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి చెందాడు. తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు బైక్‌ను ఆపేందుకు యత్నించారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పడంతో వాహనదారుడు కిందపడ్డాడు. వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు అతడి తల పైనుంచి వెళ్లడంతో మృతి చెందాడు. దీంతో అక్కడున్న వాహనదారులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు.

సంబంధిత పోస్ట్