

సైన్యానికి మనమంతా ఉన్నామన్న ధైర్యం ఇవ్వాలి: పవన్ (వీడియో)
భారత సైన్యానికి మనమంతా ఉన్నామన్న ధైర్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.ఇక పాకిస్తాన్ ఆటలు సాగవని.. వారికి శాంతివచనాలు పనికి రావని అన్నారు. "క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా సైన్యానికి మేమున్నామన్న ధైర్యం ఇవ్వాలి. సైన్యాన్ని కించపరచే సూడో సెక్యులరిస్టుల నోరు మూయించాలి. సెలబ్రిటీల నుంచి దేశభక్తి ఆశించవద్దు. సెలబ్రిటీలు వినోదాన్ని మాత్రమే పంచుతారు.. దేశాన్ని నడపరు." అని పవన్ వ్యాఖ్యానించారు.