కూకట్ పల్లి నియోజకవర్గం 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ లో గురువారం స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వార్షికోత్సవం సందర్భంగా కార్పొరేటర్, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ హోమము, హారతి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.