
ఢిల్లీలో 45.56 శాతం ఓట్లను సాధించిన బీజేపీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం అందుకుంది. మొత్తం 70 సీట్లలో 48 సీట్లను గెలుచుకుని విజయదుందుభి మోగించింది. కాషాయ పార్టీ.. ఈ ఎన్నికల్లో 45.56 శాతం ఓట్లను సాధించింది. 2020లో దక్కించుకున్న 38.51 శాతంతో పోలిస్తే ఏడు శాతం మెరుగుపరుచుకుంది. 2015లో కమలదళం ఓటు వాటా 38.51 శాతంగా ఉంది. మరోవైపు, 2020లో 62 స్థానాల్లో గెలుపొందిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈసారి ఏకంగా 40 సీట్లు కోల్పోయి 22కే పరిమితమైంది.