కూకట్ పల్లి నియోజకవర్గం జైబాబు జైభీమ్ జైసంవిధాన్ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆదివారం అల్లాపూర్ డివిజన్లో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాజ్యాంగ మూలసూత్రాన్ని మార్చాలని అనుకోవడం అవివేకమన్నారు.