

మహిళలకు ఫ్లయింగ్ కిస్‌లు.. MLAపై కేసు నమోదు (VIDEO)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగం విహార్ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన ఆప్ MLA దినేష్ మోహానియా.. మహిళలకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారన్న వార్త వివాదాస్పదంగా మారింది. తనతో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు తననే చూస్తూ సైగలు చేసినట్లు బాధితురాలు ఆరోపించారు. MLA తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు.. దినేష్‌పై FIR నమోదు చేశారు.