చికిత్స పొందుతూ వైద్య విద్యార్థి మృతి

70చూసినవారు
చికిత్స పొందుతూ వైద్య విద్యార్థి మృతి
చికిత్స పొందుతూ వైద్య విద్యార్థి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో చోటు చేసుకుంది. ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్న వరుణ్‌తేజ్‌ (23) కడుపులో మంటగా ఉందని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అపెండిసైటిస్‌గా గుర్తించారు. గురువారం శస్త్ర చికిత్స చేస్తుండగానే వరుణ్‌తేజ్‌ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడని ఆరోపిస్తూ అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్