హైదరాబాద్ లో మైక్‌లు బంద్.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం

65చూసినవారు
హైదరాబాద్ లో మైక్‌లు బంద్.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం
రాష్ట్రంలో నియంతృత్వ పాలన త్వరలోనే అంతమొందుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో పెద్ద పండుగైన బతుకమ్మకు రాష్ట్ర ప్రభుత్వం మైక్ లకు అనుమతి ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. గతంలో కెసీఆర్ నేతృత్వంలో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇస్తే ప్రస్తుతం వాటిని కూడా ఆపేశారని అన్నారు. రాజకీయాల కోసం సంప్రదాయాలను పాడు చేయవద్దని ఎమ్మెల్యే కృష్ణారావు మంగళవారం సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్