TG: టెన్త్ పరీక్షల్లో ఇంటర్నల్స్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలగాణలో పదవ తరగతి పరీక్షల మార్కుల విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 100 మార్కులకు పరీక్షలు నిర్వహించనుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇంటర్నల్స్ కు 20 మార్కులు, రాత పరీక్షకు 80 మార్కులు ఉండేవి. ఇంటర్నల్ మార్కుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో.. తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.