250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్: కాంగ్రెస్
ఝార్ఖండ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఒకరోజు ముందు మేనిఫెస్టోను విడుదల చేసింది. ఝార్ఖండ్‌లో తాము అధికారంలోకి వస్తే 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో కులగణన చేపడతామని వెల్లడించింది. కాగా, ఝార్ఖండ్‌తో రేపు జరిగే ఎన్నికలకు అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు.